అంతరిక్షం కోసం మెగాస్టార్ వస్తున్నాడు 

23 Nov,2018

మెగా హీరో వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అంతరిక్షం 9000 km h సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్న ఈ సినిమా తెలుగులో మొదటి స్పేస్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 9న జరపనున్నారు .. ఈ వేడుకకు ముఖ్య అథితిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారని టాక్. దాంతో పాటు పవర్ స్టార్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందట. మెగా హీరోలిద్దరు ఈ వేడుకలో గెస్ట్ గా పాల్గొంటే .. ఆ ఈవెంట్ మెగా హిట్ గా నిలవడం ఖాయం. లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నారు అన్నట్టు ఈ వేడుక హైదరాబాద్ లోనే జరపనున్నారట.

Recent News