తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాతలు. ఈ సినిమా ఈ శుక్రవారం (23న) విడుదలవుతున్న సందర్బంగా హీరో తనీష్ మీడియాతో మాట్లాడుతూ: ‘‘రంగు టైటిల్ ఎందుకు అంటే ప్రతి మనిషి లోనే చాలా రంగులుంటాయి, డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, అవి బయటకు వచ్చే సందర్భాలుంటాయి అలాగే నేను ప్లే చేస్తున్న ‘లారా’పాత్రకు 19 యేళ్ళ వయస్సు నుండి 27 యేళ్ళ వరకూ తన జీవితం చూపించడం జరుగుతుంది. అతను తన కాలేజ్ డేస్ లో స్టేట్ రాంకర్ అలాంటి పర్సెన్ తన 27 యేళ్లకు అతి దారుణంగా చంప బడ్డాడు. ఈ జర్నీ అనూహ్యంగా ఉంటుంది, అదే నన్ను ఎగ్జైట్ చేసింది. ప్రతి ఎమోషన్ ని ఒక కలర్ తో సింబలైజ్ చేస్తాం, అతని ట్రావెల్ ఎమోషన్స్ ని పీక్స్ లో ఉంటాయి. నాలుగు హోళీ పండగలు అతని జీవితాన్ని ఎలా టర్న్ చేసాయి అనేది ఈ కథ, నాలుగు వేరియేషన్స్ ఉంటాయి.. అమాయకంగా కనిపించే పాత్రనుండి ఆవేశ పడే యువకుడిగా అక్కడినుండి అతను సిస్టమ్ కి ఎదురు వెళ్ళే వ్యక్తిగా, తర్వాత తను చిక్కుకున్న వలయం నుండి బయటపడలేని ఒక అసహాయత ‘లారా’ పాత్రలో కనిపిస్తాయి. చాలా నాచురల్ గా ఉండే ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమాని ఏ జానర్ లోకి తీసుకెళ్ళలేము అలాంటి కథ, ఇందులో డ్రామా, ముఖ్యంగా ఆ పాత్ర చేసే ట్రావెల్ ఎదురయ్యే సమస్యలు అతన్ని ఎలా మార్చాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నటుడిగా 20యేళ్ళ ప్రయాణంలో నేను ఏ పాత్ర చేసినా, నా క్యారెక్టర్ కి హాండ్రడ్ పర్సెంట్ జస్టిఫై చేసానా లేదా అని చూసుకుంటాను. సక్సెస్ ఎప్పూడూ అవసరమే, సక్సెస్ అవసరం లేని సందర్భం ఉండదు అని నమ్ముతాను. నేను హీరోగా ఇండస్ట్రీకి రాలేదు.. ఒక నటుడిగా వచ్చాను, నాకు రంగుతో సక్సెస్ వచ్చినా, నన్ను ఎగ్జైట్ చేసే పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. ‘లారా’ తన ఐడియాలిజీ పరంగా కరెక్ట్, కానీ తన ఎంచుకున్న దారిలో తప్పు చేసాడు. తను తీసుకున్న నిర్ణయాలు ఎలా తన జీవితాన్ని మలిచాయో అన్న రియలేజషన్ వచ్చాక అతన్ని చంపేస్తారు. రేపు తన పాప పుడుతుంది అనగా ఈరోజు రాత్రి అతన్ని చంపేస్తారు. ఆ సన్నివేశం లో చాలా ఎమోషనల్ అయ్యాను. చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగాలతో నింపుతుంది. ఆ పాత్ర చేస్తున్నప్పుడు నేను కొన్ని సందర్బాలలో కనెక్ట్ అయ్యాను, నేనే కాదు చాలామంది కరెక్ట్ అవుతారు అని నమ్ముతున్నాను. ఈ సినిమా ఎలా ఉన్నా నా లైఫ్ లో మెమరబుల్ సినిమాగా ఉండిపోతుంది. ఎందుకంటే వందల సినిమాలు చేసిన పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాను సొంత సినిమాగా ఫీల్ అవుతున్నారు. అది నాకు గర్వంగా ఉంది. ఇమేజ్ బ్రేక్ లను నేను నమ్మను, రంగు తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథను కూడా నేను చేసి మెప్పించగలను ఒక నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలనుకున్నాను. రంగు రిజల్ట్ మీద చాలా నమ్మకం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నా సినిమా రిజల్ట్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఎన్ని బ్యాడ్ ఫిల్మ్ చేసినా, ఒక మంచి సినిమాతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. కావాలని కాంట్రవర్సరీలు క్రియేట్ చేయలేదు, అలా చేసి ఉంటే వాళ్లను పిలిచి కాంప్రమైజ్ కాము కదా, ఇంకా ఆగోడవను పెంచేవాళ్లం. దర్శకుడు కార్తికేయ తనుచెప్పిన కథ కంటే సినిమా బెటర్ గా చేసాడు. ఈ సినిమా ప్రివ్యూలో మా అమ్మ చివరిలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఆ సందర్భంలో నటుడిగా తృప్తి చెందాను. ఈ సినిమా నాకు మోస్ట్ మెమరబుల్ మూవీ గా మిగులుతుంది. రంగు సినిమాలో ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతున్నాయి అని నమ్ముతున్నాను. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది’’ అన్నారు.