పాపం ఇలియానా .. బ్యాక్ టూ పెవిలియన్
గోవా బ్యూటీ ఇలియానా తెలుగు తమిళంలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డంను దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించి తన అందంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఇలియానా బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడకు వెళ్లింది. బాలీవుడ్ లో కొంత కాలం ఈమె జర్నీ సాఫీగానే సాగినా కొన్నాళ్లకు అక్కడ ఒడిదొడుకులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలోనే సౌత్ నుండి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఆఫర్ రావడంతో బాలీవుడ్ కు బై బై చెప్పేసి వచ్చేసింది.అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో ఇలియానా నటిస్తుందనే వార్త రాగానే సినిమా పై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆమె సినిమాలో ఉండటం సినిమాకే మైనస్ అన్న టాక్ వచ్చింది. ఇలియానా బాగా లావు అవ్వడంతో పాటు ఆమె మొహంలో మునుపటి ఆకర్షణ లేదు. దాంతో ఇలియానాను ప్రేక్షకులు తిరష్కరించారు. అమర్ అక్బర్ ఆంటోనీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పాటు తన లుక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన కారణంగా ఇలియానా మళ్లీ బాలీవుడ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.