స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగి ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేక బాగా వెనకపడిపోయారు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . ఇటీవల తన కొడుకుతో ‘మెహబూబా’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన పూరి ఆచిత్రం తో కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయాడు. ఇకఈ సినిమా తరువాత కొన్ని నెలల గ్యాప్ తీసుకొని మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడట ఈ డైరెక్టర్. పూరి , ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక చిత్రం తెరకెక్కించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. రామ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఈ వార్తలపై సానుకూలంగానే స్పందించాడు. ఇక ఎట్టకేలకు ఈ రేర్ కాంబినేషన్ లో సినిమా మొదలు కానుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ఫై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు వున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పూరి హోమ్ బ్యానర్ అలాగే శ్రీ స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.