హుషారు పాటకు అర్జున్ రెడ్డి ప్రశంశ  

21 Nov,2018

లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించిన చిత్రం హుషారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్‌ కానుంది . యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన హుషారు సినిమా పాటలు, ట్రైలర్లకు మంచి క్రేజ్ వచ్చింది . ఈ సినిమాలో మూడో   పాటను '' డియర్ కామ్రేడ్'' షూటింగ్‌‌లో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'' ప్రస్తుతం కాకినాడలో నా సినిమా షూటింగ్ జరుగుతోంది . నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు హర్ష నా సెట్‌కు వచ్చి హుషారు సినిమా పాటను రిలీజ్ చేయమని అడిగారు. ఇప్పటికే సిద్ శ్రీరాం పాడిన పాటను విన్నాను. ఫ్రెండ్ షిప్ ఆధారంగా రూపొందించిన మూడో పాటను రిలీజ్ చేయమన్నారు. పాట రిలీజ్‌కు ముందు సినిమాకు సంబంధించిన సంఘటన ఒకటి మీకు చెప్పాలి. వాస్తవానికి పెళ్లిచూపులకు ముందే హర్ష నాకు ఈ సినిమా స్క్రిప్టు పంపించారు. స్క్రిప్టు చదువుతున్నప్పుడే నాకు విపరీతంగా నవ్వు వచ్చింది. నాకు  నచ్చే అర్బన్ టైప్ కామెడీ ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. హుషారులో ఫ్రెండ్ షిప్  సాంగ్‌ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకొంటాను. ఈ  పోస్టర్‌, ట్రైలర్లను చూస్తుంటే నాకు పెళ్లిచూపులు రోజులు గుర్తుకొస్తున్నాయి. మొదటి సినిమా అప్పుడు ఉండే ఉత్సాహం హర్షలో కనిపిస్తున్నది. ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ పాటను కూడా ఎంజాయ్ చేయండి'' అని విజయ్ దేవరకొండ  అని అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''విజయ్ దేవరకొండతో మంచి రిలేషన్ ఉంది. అందుకే కాకినాడలో జరిగే షూటింగ్‌కు వచ్చి విజయ్ దేవరకొండను కలిశాం. మా హుషారు చిత్రంలోని ఫ్రెండిషిప్ పాటను రిలీజ్ చేయమని అడగ్గానే సంతోషంగా ఒప్పుకొన్నారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు.
దర్శకుడు హర్ష మాట్లాడుతూ..'' పెళ్లిచూపులకు ముందు నుంచి నాకు విజయ్ దేవరకొండతో పరిచయం ఉంది. అప్పట్లో ఈ స్క్రిప్టును ఆయనకు పంపాను. చాలా బాగుందని అప్పట్లో రెస్పాన్ష్ ఇచ్చారు. ప్రస్తుతం అదే సినిమాకు సంబంధించిన పాటను విజయ్ దేవరకొండతో రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. 

Recent News