ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫర్స్‌తో వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకుని గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా సినిమా రెండో ట్రైలర్‌ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రిమిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవలె విడుదలైన మా ట్రైలర్ కిగాని, టీజర్‌కిగాని ఇంత అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ర్టీలో ఉన్న పెద్దలందరూ చూసి తమ మాటల్లో మంచి పోజిటివ్ ఎనర్జీని అందిస్తున్నారు. ఇంత మంది ప్రముఖుల ఆదరణ ఈ సినిమాకి లభించడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైలర్‌ని మేము అడిగిన వెంటనే త్రివిక్రమ్‌గారు విడుదల చేయడం చాలా సంతోషం ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు విద్యాసాగర్, జనార్ధన్, బెల్లం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.