రెండో షెడ్యూల్లో ప్లానింగ్

21 Nov,2018

                                                                                                                                                                                                            సాయి గణేష్ మూవీస్ పతాకంపై మహేంద్ర ,కులకర్ణి మమతా హీరో హీరోయిన్లుగా ప్రముఖ కన్నడ నటి అలీషా ముఖ్య పాత్రలో బి ఎల్ ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్ ఎస్ తిరివీధి నిర్మాతగా నిర్మిస్తున్న లవ్ అండ్ సస్పెన్స్ థ్రిలర్ మూవీ "ప్లానింగ్ "               ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూలు కర్ణాటక పరిసర ప్రాంతాలలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని , హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శర వేగంగా రెండొవ షెడ్యూలు షూటింగ్ జరుపుకుంటోంది.  ఈ సందర్భంగా దర్శకుడు  బి ఎల్ ప్రసాద్ మాట్లాడుతూ...ప్రేమానురాగాల సమ్మేళనం కు సందేశాన్ని జోడించి చక్కటి చక్కటి  కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో ఐదు పాటలు , మూడు ఫైట్లు ఉన్నాయి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు . నిర్మాత ఆర్ ఎస్ తిరివీధి మాట్లాడుతూ...ఈ చిత్రం లోని ఐదు పాటలు ఉదయ్ కిరణ్ సంగీత సారధ్యంలో అద్భుతమైన ట్యూన్లు అందిచారు , ప్రముఖ కన్నడ నటి అలీషా ముఖ్య పాత్రలో వచ్చే ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది ,  దర్శకుడు ఈ చిత్రాన్ని విసువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు , నేను ఎక్కడ కంప్రమైజ్ కాకుండా ఖర్చుకు ఎనకాడకుండా నిర్మిస్తున్నానన్నారు .   ఇంకా ఈ చిత్రంలో రంగ సాయి , ఉరుకుందప్ప ,సంతోష్ , అతిధి , చైతన్య ,లక్ష్మి ,సాయిరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : ఏడుకొండలు ( ఆర్యన్ ), ఎడిటింగ్ : నాగు , ఫైట్స్ : వాసు , డాన్స్ :బషీర్ ,సంగీతం : ఉదయ్ కిరణ్ ,  నిర్మాత : ఆర్ ఎస్ తిరివీధి , మాటలు దర్శకత్వం : బి ఎల్ ప్రసాద్

Recent News