టాక్సీవాలా టార్గెట్ .. వందకోట్లు 

20 Nov,2018

అర్జున్ రెడ్డి మేనియా .. ఇంకా విజయ్ దేవరకొండ కు వర్కవుట్ అవుతూనే ఉంది. ఇప్పటికే అయన నటించిన గీత గోవిందం తో టాలీవుడ్ లో వంద కోట్ల హీరోల జాబితాలో నిలిచిపోయాడు. ఆ తరువాత లేటెస్ట్ గా టాక్సీవాలా గా ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు లీక్ అవ్వడంతో యూనిట్ మొత్తం టెన్షన్ లో పడింది . . అయినా సరే సినిమా పై ఉన్న నమ్మకంతో ఈ నెల 17న విడుదల చేసారు. విడుదలైన మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు విజయ్ మేనియా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. అయితే ఈ సినిమా వందకోట్ల మార్కెట్ కొడుతుందా అన్న అంచనాలు ఎక్కువయ్యాయి. నోటా ప్లాప్ తో విజయ్ క్రేజ్ తగ్గిందని అనుకున్న వాళ్లకు .. టాక్సీవాలా వందకోట్ల వసూళ్లు అందుకుని సంచలనం రేపుతోంది నిర్మాతలు భావిస్తున్నారు. 

Recent News