విలన్ గా మారుతున్న వరుణ్ తేజ్

20 Nov,2018

మొత్తానికి భిన్నమైన సినిమాలతో సత్తా చాటుతున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం అయన తెలుగులో మొదటి స్పేస్ సినిమాగా అంతరిక్షం చేస్తున్నాడు.  దాంతో పాటు తాజాగా విలన్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే .. తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు హరీష్ శంకర్. అల్లు అర్జున్ తో అయన చేసిన డీజే ఆశించిన స్థాయి సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాకు చాలా టైం పట్టింది. తాజాగా జిగర్తాండ ని రీమేక్ చేసేందుకు  చేసుకున్నాడు. విజయ్ సేతుపతి, సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. పలు అవార్డులు అందుకున్న ఈ సినిమాలో ఓ నెగిటివ్ రోల్ కూడా ఉందట .. ఆ పాత్రకోసం మెగా హీరో వరుణ్ తేజ్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడట. తమిళంలో ఆ పాత్రను బాబీ సింహ చేసాడు. ఆ సినిమాతో అతనికి మంచి క్రేజ్ దక్కింది. మరి హీరోగా బిజీగా ఉన్న వరుణ్ ఈ నెగిటివ్ రోల్ కు ఓకే అంటాడా లేదా అన్నదిచూడాలి.

Recent News