ట్రిపుల్ ఆర్ షూటింగ్ మొదలైంది 

20 Nov,2018

టాలీవుడ్ తో పాటు అందరిలో ఆసక్తి రేపుతున్న క్రేజీ మల్టి స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా క్రేజీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది. నవంబర్ 11న పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయినా ఈ సినిమా నేటినుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. దీనికి సంబందించిన లొకేషన్ స్టిల్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అయితే హైదరాబాద్ శివారుల్లో సినిమాకోసం ప్రత్యేక సెట్ వేశారు. మరి మొదటి షెడ్యూల్ లో రామ్ చరణ్, లేదా ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు పాల్గొంటారని టాక్. అన్నట్టు ఈ లొకేషన్ నుండి హైదరాబాద్ కు వెళ్లిరావడం టైం వెస్ట్ అని .. యూనిట్ కోసం ఓ స్పెషల్ ఇంటి సెట్ ని వేశారు .. టీమ్ మొత్తం అక్కడే ఉంటుందట. ఇక ఈ సినిమా టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Recent News