సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తోన్న చిత్రం `24 కిస్సెస్`. అయోధ్యకుమార్ క్రిష్ణంసెట్టి దర్శకుడు. సం్జయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ...మంచు లక్ష్మి మాట్లాడుతూ - ``సంజయ్, అదిత్, హెబ్బా బాగా తెలుసు. విజువల్స్ చాలా బావున్నాయి. మిణుగురులు సినిమాతో 7 నంది అవార్డులు, జాతీయ అవార్డును కూడా అయోధ్యకుమార్ గారు దక్కించుకున్నారు. ఈ సినిమాతో చాలా డబ్బులు రావాలి. నవంబర్ 23న సినిమా విడుదలవుతుంది. సినిమాను తప్పకుండా ఆదరించండి`` అన్నారు. నవదీప్ మాట్లాడుతూ - ``అరుణ్ అదితి నాకు మంచి మిత్రుడు. అయోధ్యకుమార్‌గారికి మంచి పేరు రావాలి. హెబ్బా చాలా బోల్డ్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తుంది. ఎంటైర్ టీంకు అభినందనలు`` అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ - ``సంజయ్ రెడ్డిగారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో ప్రస్థానం నుండి పరిచయం ఏర్పడింది. అయోధ్యకుమార్‌గారి మిణుగురులు సినిమా చూశాను. ఇక 24 కిస్సెస్ విషయానికి వస్తే విజువల్స్ చాలా బావున్నాయి`` అన్నారు. సీనియర్ నరేశ్ మాట్లాడుతూ - ``ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ చిత్రాలతో పాటు కల్ట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నాయి. అయితే 24 కిస్సెస్ విషయానికి వస్తే ఇది కల్ట్ మూవీ కాదు. చాలా డెప్త్‌తో దర్శకుడు అయోధ్యకుమార్ ఈసినిమాను తెరకెక్కించారు. ముద్దు అనేది బ్యూటీఫుల్ ఎమోషన్. దాన్ని కవితాత్మకంగా అయోధ్యకుమార్ తెరకెక్కించారు. నా సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి విజయాలను అందుకున్నాను. ఈ సినిమాతో మరో సక్సెస్‌ను సాధిస్తాననే నమ్మకం ఉంది. లవ్ సినిమాల్లో మంచి మ్యూజిక్ ఉండాలని జాయ్ బరువా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అరుణ్, అదిత్ చాలా కష్టపడి ఎమోషన్‌ను పండించారు. ఎంటైర్ యూనిట్ కంగ్రాట్స్`` అన్నారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ - ``ముద్దు అనేది బ్యూటీఫుల్ ఎమోషన్స్. దాన్ని తెరపై చూపించడం అంత సులభం కాదు. దర్శకుడి గారి విజన్‌ను అర్థం చేసుకుని ఓ ఎమోషన్‌ను క్యారీ చేయడం గొప్ప విషయం. అరుణ్, హెబ్బాపటేల్ చక్కటి ఎమోషన్స్‌ను క్యారీ చేసుంటారని భావిస్తున్నాను`` అన్నారు.
నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ - ``ఈ జర్నీ లో చాలా ఎగుడుదిగుడులను చూశాం. అన్ని సమస్యలను దాటి సినిమాను ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. మా ప్రయత్నం తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
చంద్రసిద్ధార్థ మాట్లాడుతూ - ``మిణుగురులు చిత్రంతో జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించి అయోధ్య కుమార్ పక్కా కమర్షియల్ చిత్రంతో మన ముందుకు వచ్చారు. సినిమా కళాత్మకమైన కమర్షియల్ సినిమాను అయోధ్యకుమార్ తెరకెక్కించి ఉంటాడనేది నా నమ్మకం. అరుణ్ అదితి, హెబ్బాపటేల్ సహా యూనిట్‌కి అభినందనలు`` అన్నారు.
సిద్ధు మాట్లాడుతూ - ``యూనిట్‌తో మంచి అనుబంధం ఉంది. వారు ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా