బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో సంచలనం రేపారు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో పెద్ద దుమారమే రేపుతున్న అయన తాజగా భరత్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండో పాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాకిస్తాన్ జెండా ఎగురవేసే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో అక్కడ ఉన్న జనాలు .. పరుగున వెళ్లి .. ఎందుకు భరత్ భూభాగం పై పాకిస్తాన్ జండా ఎగురువేస్తున్నారని ప్రశ్నించారట. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ జెండా ఎగుర వేయొద్దని తీవ్ర అభ్యన్తరం చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందట. మనకు శత్రు దేశమైన పాకిస్తానీ జెండా ఎగురవేసి సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అయితే పాకిస్తానీ జెండా ని ఎగురవేసింది షూటింగ్ లో భాగమే అని యూనిట్ పేర్కొంది. ఈ వ్యవహారం పై పోలీసులకు పిర్యాదు అందింది.