వర్మ మరో బోల్డ్ మూవీ వస్తుంది 

19 Nov,2018

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలన చిత్రానికి తెర లేపాడు. ప్రస్తుతం అయన కన్నడ తెలుగులో నిర్మిస్తున్న భైరవ గీత ఈ నెల 30న విడుదల కానుంది. సిద్దార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వర్మ  నిర్మించిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని ట్రైలర్ చుస్తే అర్థం అవుతుంది .. అయితే బోల్డ్ కంటెంట్ కూడా ఓ రేంజ్ లో ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో అసలు కథ కంటే కూడా బోల్డ్ కంటెంట్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మరోవైపు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి వర్మ మార్క్ కంటెంట్ ని ఇష్టపడేవారు .. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.  

Recent News