మరో మల్టి స్టారర్ సినిమాలో నాని 

19 Nov,2018

నాచురల్ స్టార్ నాని మరో మల్టి స్టారర్ సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమా చేసిన నాని తాజాగా మరో మల్టి స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇందులో మరో హీరో ఎవరన్నా విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నాని నటిస్తున్న జెర్సీ సినిమా తో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ తో జంటిల్మెన్ తరువాత మరో సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే కథ చెప్పి నాని ని ఒప్పించాడు ఇంద్రగంటి. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడట. మరి నాగ్ తో చేసిన దేవదాస్ పెద్దగా వర్కవుట్ కాలేదు .. కనీసం ఈ మల్టి స్టారర్ అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.  

Recent News