బాహుబలి తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ స్థాయికి తగ్గట్టే యూనిట్ కూడా భారీగానే తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన మేకింగ్ వీడియొకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ఈ టీమ్ ఇంకా రెట్టింపు ఉత్సహంతో జోరు పెంచింది. ఇక తాజాగా మరో విశేషం ఏమిటంటే .. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్టు టాక్ ? నిజంగా ఇది ప్రభాస్ ఫాన్స్ కు హ్యాపీ న్యూస్ అని చెప్పాలి .. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది కాలంగా అయన అభిమానులు ఎదురు చూస్తున్నారు .. సో సాహో సినిమా డేట్ కన్ఫర్మ్ కావడం నిజంగా వారికి పండగే కదా !! ఇంతకీ రిలీజ్ ఎప్పుడో తెలుసా .. వచ్చే ఏడాది ఆగస్టు 15న ? ఎస్ .. ఆ రోజునే తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దాంతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో సినిమా కూడా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.