అజిత్ విశ్వాసం పూర్తి  

17 Nov,2018

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. పూణే లో జరిగిన చివరి షెడ్యూల్ లో సాంగ్ సీక్వెన్స్ తో పాటు ,యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించారు. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్ లో కనిపించనునున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా మరొకటి వృద్ధుడి పాత్ర. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో అజిత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 10న విడుదలకానుంది. ఇక శివ -అజిత్ కలయికలో వస్తున్న ఈ నాల్గవ చిత్రం ఫై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
 

Recent News