తుమారి సూలు రీమేక్ లో మంచు లక్ష్మీ - జ్యోతిక 

17 Nov,2018

టాలీవుడ్ డైనమిక్ లేడీగా పేరు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మి. ప్రస్తుతం తమిళంలో ‘‘కాట్రిన్ మెళి’’ అనే సినిమా చేసింది ‘‘తుమ్హారీ సులు’’ అనే బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రధాన పాత్రలో జ్యోతిక నటిస్తోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మిది పూర్తిగా భిన్నమైన పాత్ర. మాటల్లో బోల్డ్ నెస్, క్యారెక్టర్ లో స్ట్రాంగ్ గా కనిపించే పాత్ర ఆమెది. నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ మంచు లక్ష్మి జ్యోతిక మనసు దోచేసుకుంది. అందుకే ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి వ్యక్తిత్వాన్ని పొగుడుతూ జ్యోతిక చెప్పిన మాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మంచు లక్ష్మి గురించి జ్యోతిక ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే చూద్దాం..
‘‘ మంచు లక్ష్మితో వర్క్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. తను చాలా పవర్ ఫుల్ లేడి. తను నటించే విధానం చూసి నాకు చాలా ముచ్చటేసింది. నిజంగా తను యాక్ట్ చేస్తున్నట్టే కనిపించదు. జస్ట్ ఆ క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తుంది. నిజ జీవితంలో కూడా తను చాలా తెలివిగా, కాన్ఫిడెంట్ గా ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. తన నటన, ప్రవర్తన చూసినప్పుడు.. బాబోయ్.. నేను తనతో సరితూగగలనా అనిపించింది. మేం ఇద్దరం ఇప్పుడు అమ్మలం. సెట్స్ లో కూడా మా పిల్లలతో కలిసి బాగా కలిసిపోయాం’’. అంటూ జ్యోతిక చెప్పిన మాటలకు లక్ష్మి కూడా ఆశ్చర్యపోయారు. ఇక హిందీలో మంచి విజయం సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ‘‘తుమ్హారీ సులు’’.. విద్యాబాలన్ పోషించిన పాత్రను జ్యోతిక చేస్తోంది. రేడియో స్టేషన్ మేనేజర్ గా అక్కడ నేహాధూపియా చేసిన పాత్రలో మంచు లక్ష్మి కనిపించబోతోంది. అర్థరాత్రి తర్వాత కాస్త హాట్ హాట్ గా కథలు వినిపించే
రేడియో జాకీ పాత్రలో జ్యోతిక నటిస్తోంది. తనకు పూర్తిగా మద్ధతుగా నిలిచి ధైర్యం చెప్పే పాత్రలో మంచు లక్ష్మి నటించింది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన కూడా వస్తోంది. ఇక నవంబర్ 16న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకుడు. మొత్తంగా మంచు లక్ష్మి ఇంటనే కాదు.. రచ్చ కూడా గెలిచేసింది.
 

Recent News