లోఫర్ గాడి ప్రేమ కథ

శ్రీ రామ రక్ష ఫిలిమ్స్, స్మైలింగ్ డ్రీమ్స్,సంస్థలు సంయుక్తంగా సాగర్ యమ్ యన్ వి ,వెన్నెల విహర్ హీరో  హీరోయిన్లుగా,  సాగర్ యమ్ యన్ వి దర్శకత్వంలో ఏనుగుతల దేవదాసు, సైధూల్ బాథరాజ్ (సిద్దు) నిర్మిస్థున మాస్ ఎంటర్టైనర్ "కొంటె కుర్రాడు". ఓ లోఫర్ గాడి ప్రేమ కథ ట్యాగ్ లైన్. ఇటీవలె రాజ్ కందుకూరి ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. హీరో రవితేజ అమర్ అక్బర్ అంథోని చిత్రం విడుదల సందర్భముగా ఓ ప్రత్యేక పాటను ఈ చిత్ర యూనిట్ రవితేజ కు డెడికెట్ చేశారు. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. మా హీరో దర్శకుడు సాగర్  మాస్ మహా రాజ్ రవితేజ కి వీరాభిమాని. శుక్రవారం రవితేజ నటించిన "అమర్ అక్బర్ అంథోని" సినిమా విడుదల సందర్భంగా మా చిత్ర సంగీత దర్శకుడు  యస్ ఏ  అరమాన్ రచించిన, ప్రముఖ గాయకుడు రాంకి ఆలపించిన ఒక స్పెషల్ సాంగ్ ని మాస్ మహా రాజ్ కి డెడికేట్ చేస్తూ, కుకట్ పల్లి వసంత నగర్ లో "అరుణ ప్రియ హోల్డ్ ఏజ్ హోమ్ "వృద్ధుల మధ్య విడుదల చేశాము.  సాగర్  ఈ సినిమా ని చాల బాగా తీర్చిదిద్దుతున్నారు‌. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని  అన్నారు.  మాస్ లవ్ ఎంటర్టైనర్ గా తీస్తొన్న ఈ సినిమా లో తాను  రవితేజ గారి అభిమాని గా కనిపిస్తానని, సస్పెన్స్ లవ్ తో ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని,  మరో హీరొయిన్ నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందని హీరో,దర్శకుడు సాగర్  అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రవీణ్. కె కావలి, మ్యూజిక్: యస్.ఏ .అరమాన్,ఎడిటింగ్: మహేశ్, పోస్టర్ డిజైనింగ్: జగదీష్ కుమార్,కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: సాగర్ యమ్ యన్ వి."

Recent News