బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకోనె, రణవీర్ సింగ్ లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో దీపిక, రణ్‌వీర్ కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధుమిత్రులు పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి 14, 15వ తేదీల్లో సింధి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటలకు దీపిక, రణ్‌వీర్ వివాహం జరిగింది. ఇదిలా ఉంటే, ఈ బాలీవుడ్ జంట ఇండియాలో రెండు రిసెప్షన్లను ఏర్పాటుచేయనుంది. నవంబర్ 21న బెంగళూరులో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు రిసెప్షన్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ముంబైలో నవంబర్ 28న వీరి రిసెప్షన్ జరగనుందని సమాచారం. కొత్త జంట దీపిక-రణ్‌వీర్ వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వీరి పెళ్లి ఫొటోల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తు్న్నారు. ఈ వివాహ వేడుక కోసం అత్యంత ఖరీదైన విల్లా డెల్ బాల్బినెల్లాను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివాహ అతిథుల కోసం లేక్ కోమో తూర్పు ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్టును బుక్ చేశారు. వారం రోజుల పాటు దీపిక, రణవీర్ ఫ్యామిలీ సభ్యులు ఇక్కడే స్టే చేయనున్నట్లు సమాచారం. ఇందులో మొత్తం 75 గదులకు గానూ రూ. 1.73 కోట్లు ఖర్చు చేస్తున్నారట.