అమ్మ క్రియేషన్స్ పతాకం పై టి. శివ నిర్మించిన చిత్రం పార్టీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జై, రెజీనా కసాంద్రా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి, చంద్రన్, సంపత్‌రాజ్, శివ, చంద్రన్ తదితరులు నటిస్తున్నారు. ప్రేమ్‌జి అమరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందజేశారు. ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో ఆడియో లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ టి. శివ మాట్లాడుతూ... ఈ ప్రొడక్షన్‌లో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఒక మంచి చిత్రాన్ని తీశానని ఆనందపడుతున్నాను. డైరెక్టర్ చాలా బాగా తీశారు. ఇకముందు కూడా నేను ఈ డైరెక్టర్‌తో కలిసి సినిమాలు చెయ్యడానికి రెడీగా ఉన్నాను. మీరందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ... ఇది నా 8వ చిత్రం. నేను ఇదే బ్యానర్‌లో మరో చిత్రం కూడా చేస్తున్నాను. స్టోరీ లైన్ కొంచం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. డీమానిటైజేషన్ జరిగినప్పుడు పడిన ఇబ్బందులు గురించి తీసుకుని చేసిన కథ ఇది. ఈ చిత్రం పి.ఎం.గారి స్పీచ్‌తో మొదలవుతుంది. ఇందులో చాలా పాత్రలున్నాయి. చాలా హాస్య సన్నివేశాలున్నాయి. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ... ఆర్ ఎక్స్ 100 చిత్రం ఫస్ట్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు నేను ఎవరికీ తెలియదు. ఇండస్ర్టీకి కొత్త. ఆ ట్రైలర్ చూసి ముందుగా ట్విటర్‌లో షేర్ చేసింది వెంకట్ ప్రభుగారు. నేనెవరో ఆయనకు తెలియదు ఆయనెవరో నాకు తెలియదు నచ్చి ఆయన షేర్ చేశారు. తర్వాత జయ్‌గారు, ప్రేమ్‌జీగారు వీళ్ళందరూ షేర్ చేశారు. వీళ్ళు నన్ను అతిధిగా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూశాను చాలా బావున్నాయి. లాస్ట్ సాంగ్ చాలా బాగా వచ్చింది. మెయిన్ నేను ఆనందంగా ఫీలవడానికి కారణం రమ్యకృష్ణగారిని చూడటం ఇదే మొదటిసారి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నా కూడా నేను చూడలేకపోతున్నా భయంకంటే సిగ్గుగా ఉంది. ఇందులో నటించిన నటీనటులకు టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. కట్టప్పా, శివగామిల రొమాన్స్ చూడాలంటే పార్టీ సినిమా చూడాల్సిందే అని అన్నారు.
సత్యరాజ్ మాట్లాడుతూ... ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన శివగారికి, ప్రభుగారికి నా కృతజ్ఞతలు. కట్టప్ప మనవడిని ఇంట్రడ్యూస్ చేశారు. మీరందరూ తప్పక ఆదరించాలి. తెలుగు ఆడియన్స్‌కి కేవలం సత్యరాజ్ అంటే రెండు పాత్రల్లో మాత్రమే చూశారు. చాలా డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్ మిర్చీ, నేను శైలజారెడ్డి, బ్రహ్మాత్సం వంటి చిత్రాల్లో కాని ఈ చిత్రంలో కట్టప్పగ్రాండ్ సన్‌చాలా డిఫరెంట్ పాత్ర చేశాను. రమ్య మాడమ్ ఫస్ట్ చిత్రంలో నేను విలన్‌గా చేశాను. ఈ చిత్రంలో టోటల్ ఫన్ గా ఉంటుంది. ఎంటైర్ షూటింగ్ మొత్తం ఫిజి ఐలాండ్స్‌లో జరిగింది. ఎప్పుడూ షూటింగ్ అయిపోగానే నేను నా రూమ్‌కి వెళ్ళిపోయేవాడ్ని కాని ఈ షూటింగ్‌లో అలా కాదు నా షాట్ అయిపోయినా సెట్‌లోనే ఉండేవాడ్ని ఈ పాటలు చూశారుకదా అందుకోసం సత్యరాజ్ ఒరిజినల్ కర్యారెక్టర్ అది. కట్టప్ప క్యారెక్టర్ కేవలం సినిమాల వరకే అని అన్నారు.
రమ్య కృష్ణ మాట్లాడుతూ... ముందుగా శివగారికి, వెంకట్ ప్రభుగారికి నా కృతజ్ఞతలు. నా కూతుర్ని ఈ చిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ చేసినందుకు. సత్యరాజ్ సార్ లాగా... చాలా రోజుల తర్వాత డూయెట్‌లు పాడాను. చాలా రోజుల తర్వాత ఈ స్ర్కిప్ట్ మొత్తం నవ్వి నవ్వి నవ్వుతూ చేశాం. షూటింగ్ లొకేషన్లో కూడా అలాగే నవ్వుతూ చేశాం. ఫిజీ ఐలాండ్స్‌లో మొత్తం షూటింగ్ అంతా జరిగింది. ఎక్కడికైనా షూటింగ్‌కి వెళ్ళి పదిరోజులైతే ఇంటికి ఎప్పుడు వెళదామా అనిపించేది. అలాంటిది ఈ షూటింగ్ అసలు చాలా సరదాగా ఒక ఫ్యామిలీలా ఉన్నాం. మీరు కూడా ఈ చిత్రాన్ని చూసి చాలా ఆనందపడతారు. సత్యరాజ్‌సార్ మనవడ్ని ఎంకరేజ్ చేసినట్లు నా కూతుర్ని కూడా ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ప్రేమ్‌జీగారికి కంగ్రాట్స్ తమిళ్‌లో సాంగ్స్ రిలీజ్ అయి చాలా పెద్ద హిట్ అయ్యాయి అదే విధంగా తెలుగులో కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ హోల్ టీమ్ అని అన్నారు.