సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం "కాశి". విజయ్ ఆంటోనీ సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేయనున్నారు. భారీ పోటీ నడుమ అత్యధిక మొత్తం చెల్లించి ఈ చిత్రాన్ని దక్కించుకొన్నారు. తమిళంలో మే 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది త్వరలో వెల్లడిస్తారు.
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. కుదిరినంత తొందరలో తెలుగు వెర్షన్ ను కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి సన్నాహాలు చేస్తున్నారు.
విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, రాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటర్: లారెన్స్ కిషోర్, నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి, రచన-దర్శకత్వం: కిరుతిగ ఉదయనిధి.