- Home
- News
- మార్చి 18 నుండి నాగ్ నాని ల మల్టి స్టారర్
మార్చి 18 నుండి నాగ్ నాని ల మల్టి స్టారర్
13 Mar,2018
మార్చి 18 నుండి నాగ్ నాని ల మల్టి స్టారర్ రెగ్యులర్ షూటింగ్
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ భారీ మల్టీస్టారర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 18 ఉగాది రోజు నుంచి జరుగుతుంది.
అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్
ఈ సందర్భంగా అగ్రనిర్మాత సి.అశ్వనీదత్ మాట్లాడుతూ ''మా వైజయంతి బేనర్‌లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ సినిమాని కూడా మ్యూజికల్‌గా బిగ్గెస్ట్ హిట్ చెయ్యాలని ఫుల్‌గా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాలోని సాంగ్స్‌ని మణిశర్మ కంపోజ్ చేస్తున్నారు. మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అక్కడ జరుగుతున్నాయి. మార్చి 18 ఉగాది రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మా బేనర్‌లో ఎన్నో మల్టీస్టారర్స్ చేశాం. అవన్నీ కమర్షియల్‌గా ఘనవిజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో చేస్తున్న మల్టీస్టారర్ కూడా బిగ్గెస్ట్ హిట్ అయి మా బేనర్‌కి మరింత మంచి పేరు తెస్తుంది'' అన్నారు.
దర్శకుడు టి. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ - ''ఎంటర్‌టైనింగ్ వేలో సాగే డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. నాగార్జునగారు, నాని వంటి హీరోలతో వైజయంతి బేనర్‌లో ఈ మల్టీస్టారర్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్ డి. పట్టి, శ్రీరామ్ ఆర్. ఇరగం, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, కో-డైరెక్టర్: తేజ కాకుమాను, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్ ఆదిత్య.
Recent News