విశాల్‌ అభిమన్యుడు మొదటి పాట విడుదల

12 Mar,2018

***********తొలి తొలిగా తొలకరి పాట విడుదల***********

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నారు. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. కాగా, 'తొలి తొలిగా తొలకరి' అంటూ సాగే ఈ చిత్రంలోని మొదటి పాటను యూత్‌ స్టార్‌ నితిన్‌ చేతులమీదుగా మార్చి 8న విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ''ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మార్చి 8న ఈ చిత్రంలోని మొదటి పాటను హీరో నితిన్‌ విడుదల చేయనున్నార. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు'' అన్నారు. 

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌. 

Recent News