వాడేనా గీతావిష్కరణ

22 Feb,2018

నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం సాయి రామ్ సమర్పణలో శివ తాండేల్, నేహా దేశ్ పాండే జంటగా నటిస్తున్న చిత్రం 'వాడేనా'. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రాన్ని మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మిస్తునారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో లభ్యంకానున్న ఈ చిత్రం గీతావిష్కరణ బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శకనిర్మాత ఎన్.శంకర్ బిగ్ సిడిని విడుదల చేయగా.. మరో అతిధిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ.. "ట్రైలర్, సాంగ్స్, ఆర్.ఆర్ బాగున్నాయి. టైటిల్ లో ఇంట్రెస్ట్ ఉంటే సినిమా పై క్యూరియసిటీ పెరుగుతుంది. అదే సప్రైజ్ ఎలిమెంట్ టైటిల్ లో ఉందని భావిస్తున్నా. మనం తరచుగా వాడే పదమే 'వాడేనా' క్యాచీగా ఉండే టైటిల్ కనుక తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా" అన్నారు. 

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టే సినిమా  అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమా చిత్ర దర్శకనిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకొంటున్నాను" అన్నారు 

మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ వెన్న మాట్లాడుతూ.. "నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి నా కృతజ్ఞతలు. ఇది నా డెబ్యూ మూవీ.  వంద శాతం న్యాయం చేశాననే భావిస్తున్నా. పాటలన్నీ అందరికీ నచ్చాయని ఆశిస్తున్నా" అన్నారు. 

నిర్మాతల్లో ఒకరైన ధృవ్ మాట్లాడుతూ.. "పాటల విషయంలో చాలా సంతృప్తితో ఉన్నాను. ఇక సినిమా వంద శాతం  క్వాలిటీ  ఇచ్చాడు డైరెక్టర్. ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాం.. బడ్జెట్ 'లో' కావచ్చు కానీ క్వాలిటీ పరంగా పెద్ద సినిమాకు కష్టపడినట్టు కష్టపడ్డాము. తప్పకుండా అందరూ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా" అన్నారు.  

హీరోయిన్ నేహా దేశపాండే మాట్లాడుతూ.. "అడ్వెంచర్, ట్రెక్కింగ్ లాంటివి ఈ సినిమాలో చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు గర్వపడుతున్నా. ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు" అన్నారు. 

దర్శకుడు సాయిసునీల్ నిమ్మల మాట్లాడుతూ.. "ఎన్ శంకర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యా, రాజ్ కందుకూరి గారి "పెళ్లిచూపులు" సినిమాను 22 సార్లు చూసి ఎంతో నేర్చుకున్నా. అందుకే వీరిద్దరినీ ఈ ఆడియో వేడుకకు పిలవడం జరిగింది. సినిమా సెకెండ్ హాఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాకు నేను దర్శకత్వంమే  కాక  4సాంగ్స్ రాసాను, కొరియోగ్రఫీ కూడా చేసాను. నేను ఎవరి దగ్గరా పని చేయలేదు చాలా సినిమాలు చూసి, చాలా మందిని ఇన్స్పైరింగ్ గా చేసుకొని అనుభవాన్ని పొంది ఈ సినిమా చేయడం జరిగింది. నూతన నటీనటులనో లేక నూతన టెక్నీషియన్స్ అనో చూడకూడదు. సినిమా లో విషయం  ఉందొ లేదో మాత్రమె చూడాలి. అదే కొత్త సినిమా పెళ్లిచూపులు ప్రూవ్ చేసింది. మా "వాడేనా" సినిమా కూడా మంచి విషయం ఉన్న సినిమాగా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.  

హీరో శివ తాండేల్, నిర్మాత మణిపాల్ మచ్చి, అజయ్ గోష్, అపురూప్, కాసర్ల శ్యాం, టి ఎన్ ఆర్, రాకెట్ రాకేష్, భీమేశ్వర చారి, లోబో, లిప్సిక మరియు చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి అభినందనలను తెలియచేసారు.  

శివ తండేల్, నేహా దేశ్ పాండే, అజయ్ గోష్, సూర్య, నల్ల వేణు, చమ్మక్ చంద్ర, చిత్రం శీను, జబర్దస్త్ రాకేష్ అప్పారావు, బాబీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: 

సి భూమేశ్వర చారి, మాటలు: సాయి సున్నేల్ నిమ్మల, సి. భూమేశ్వర చారి, పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, ఆర్ ఆర్: రాజేష్.ఎస్, మ్యూజిక్: కిరణ్ వెన్న, కెమెరా: డి ఆర్. వెంకట్, ఎడిటర్: ఎస్.బి ఉద్దవ్, ఫైట్స్: రవి, డాన్స్: ఆర్ కె, ప్రొడ్యూసర్స్: మణిపాల్ అండ్ సన్స్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల. 

Recent News