వంశధార క్రియేషన్స్ మొదటి చిత్రం

22 Feb,2018

***బెల్లంకొండ  శ్రీనివాస్ తో  వంశధార క్రియేషన్స్ మొదటి చిత్రం***

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నం.1 చిత్రం పూజ కార్యక్రమాలు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాదు రామానాయుడు స్టూడియో లో ఘనంగా జరిగాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులైన సి.కళ్యాణ్, కె.ఎస్.రామారావు, ఏం.ఎస్.రాజు, అభిషేక్, శ్రీవాస్, బి.గోపాల్,ఎస్.గోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి (ఎం.ఎల్.ఏ), మహేందర్ రెడ్డి, జెమిని కిరణ్, బెల్లంకొండ సురేష్, రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, డాలీ తదితరులు పాల్గొన్నారు. 

చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ పై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా.. తెలంగాణా ఎఫ్.డి.సి ఛైర్మన్ రామ్మోహన్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. గురజాల ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు-దర్శకులు శ్రీవాస్ కలిసి కెమెరా స్విచ్చాన్ చేశారు. జీవన్ రెడ్డి (ఎమ్మెల్యే)-మహేందర్ రెడ్డిలు కలిసి స్క్రిప్ట్ ను చిత్ర బృందానికి అందించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని మాట్లాడుతూ బెల్లంకొండ సురేష్ మా ప్రాంత వాసి. అతనితో మంచి సాన్నిహిత్యం ఉంది.అలాగే వాళ్ళ అబ్బాయి బెల్లంకొండ శ్రీనివాస్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.ఇది అతని 5 వ చిత్రం,వంశధార క్రియేషన్స్ నిర్మాత నవీన్, మరియు దర్శకుడు శ్రీనివాస్ ఇద్దరికీ మొదటి సినిమా అయినా సినియర్ లు వాళ్ళకు తోడుగా ఉన్నారు. చిత్రం విడుదలై ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.

 

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ " నవీన్ తో చాలా రోజులుగా పరిచయం ఉంది. ఒక మంచి కథ దొరికితే సినిమా చెద్దాం అనుకుంటున్న సమయంలో మా దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్, హారర్ జనార్ లో వస్తున్న సినిమా ఇది. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీ లో ఎవరూ చేయని సబ్జెక్ట్. అలాగే చోటా గారితో వర్క్ చేయటం చాలా హ్యాపి గా ఉంది. థమాన్ మొదటి సారిగా నా సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. ఈ బ్యానర్ లో ఒక మంచి మూవీ తో మీ ముందుకు వస్తున్నాము. అన్నారు.

 

సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు మాట్లాడుతూ సినిమా దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వ శాఖలో చాల రోజులుగా చేస్తున్నాడు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. అల్లుడు శ్రీను కన్నా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు.

 

దర్శకుడుశ్రీనివాస్ మాట్లాడుతూ నేను చెప్పిన కథ విని నా మీద నమ్మకం తో వంశధారక్రియేషన్స్ బ్యానర్ లో మొదటి సినిమా చేసే అవకాశం కల్పించినందుకు హీరో శ్రీనివాస్ గారికి మరియు నిర్మాత నవీన్ గారికి కృతఙ్ఞతలు. రొమాంటిక్ హారర్ జోనర్ లో వస్తున్న థ్రిల్లర్ మూవీ ఇది.మార్చ్ 2 వ తేది నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాము.ఈ బ్యానర్ ఖచ్చితంగా హిట్ సినిమా అవుతుంది అని చెప్పారు.

 

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఇద్దరు ప్రముఖ హీరొయిన్ లు నటించే ఈ సినిమాకు 

నిర్మాత నవీన్ సొంతినేని

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ:- చోటా కే నాయుడు

సంగీతం:- ఎస్.ఎస్.థమన్

ఎడిటర్:- చోటా.కే.ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్ :- చిన్న

మాటలు:- కేశవ్ 

Recent News