డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ , సాక్షి జంటగా జె.బి.క్రియేషన్స్ పతాకంపై నిధి ప్రసాద్ దర్శకత్వంలో శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన చిత్రం "ఊ.పె.కు.హ." (ఉళ్ళో పెళ్లి కి కుక్కల హడావుడి).ఈ చిత్రం టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్ లో పత్రికా సమావేశం లో
హీరొయిన్ సాక్షి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ గారితో నటించటం చాలా ఆనందం గా ఉంది. అందరికి నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది.షూటింగ్లో అందరూ బాగా ఎంజాయ్ చేసారు. ప్రేక్షకులకు కూడా చక్కటి కామెడిని అందించే సినిమా అవుతుంది. అని చెప్పారు.
చిత్ర దర్శకుడు నిధి ప్రసాద్ మాట్లాడుతూ మా ఊ.పె.కు.హ. సినిమా విశేషాలు తెలియచేయటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయింది. దాదాపు 80 మంది ఆర్టిస్టులతో ఈ సినిమా చేశాం. అందరూ మనస్పూర్తిగా సహకరిండం వల్లే అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయగలిగాం.ముఖ్యంగా ఎడిటర్ శంకర్, మరియు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ చిత్ర నిర్మాణానికి,సహకరించిన ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. వారి ప్లానింగ్ వల్లే సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం. అని చెప్పారు.
నిర్మాత విక్రం మాట్లాడుతూ : సినిమా చాలా బాగా వచ్చింది. టికెట్ కొని సినిమా చూసిన ప్రతి ఒక్కరు నిరుత్సాహ పడకుండా సినిమా ఉంటుంది.క్లాస్, మాస్ అని తేడ లేకుండా అన్ని వర్గాలను అలరించే చిత్రం అవుతుంది.అని చెప్పారు.
హీరో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాత మంచి మనసున్న వ్యక్తి. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి అవసరం. అలాగే ఈ సినిమా దర్శకుడు నిధి ప్రసాద్ తో చాలా కాలంగా పరిచయం ఉంది. అందరూ దొంగలే , భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాంటి చిత్రాల్లో ఇంతకుముందు కలిసి పనిచేసాము. కామెడి ఎర్రర్స్ తో ప్రేక్షకులకు నవ్వు తెప్పించే సినిమా ఇది. దాదాపు 80 మంది కమెడియన్ లతో చేసిన సినిమా ఇది.నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేయటం నిజంగా ఒక చాలెంజ్. ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు గారు ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు. వేసవిలో ప్రేక్షకులకు నవ్వులు పంచె సినిమా అవుతుంది. అని చెప్పారు.
జె.బి. క్రియేషన్స్ పతాకం పై నిర్మించి న ఈ చిత్రాని కి
నిర్మాత: భాగ్యలక్ష్మి, దర్శకుడు: నిధి ప్రసాద్
సంగీత దర్శకుడు: అనూప్సి రూబెన్స్ సినిమాటోగ్రఫీ, వాసు,
కోరియోగ్రఫీ: అశోక్ రాజు ఎడిటింగ్ : శంకర్
సాహిత్యం: కందికొండ ఫైట్స్: స్టంట్ జాషువా, రాం సుంకర
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగరాజు
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, సాక్షి, బ్రంహానందం, ఆలి, ఎల్.బీ. శ్రీరాం, జీవా, కృష్ణ భగవాన్, బెనర్జీ, సూర్య, వేణు, రఘు, రిషి, ఖయ్యూం, కృష్ణుడు, ధనరాజ్, సాయి, హేమంత్, శోబిత రానా, తదితరులు.