ఫిబ్రవరి 23 న హైదరాబాద్ లవ్ స్టొరీ

19 Feb,2018

ఈ వారం విడుదల  కానున్న సినిమాలలో ప్రేక్షకులను అలరించే సినిమాగా కనపడుతున్న సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ, రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్, జియా, రావు రమేష్, సూర్య, సన మిగతా భారి తారాగణం నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించగా  సునీల్ కశ్యప్ సంగీతం ప్రధాన ఆకర్షణ,  ఎడిటింగ్ ఏం.ఆర్ వర్మ,  కెమెరా బి.వి అమర్ నాథ్ రెడ్డి, నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్ల.  ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యామిలీ ఆడియెన్స్  అండ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రేక్షకులలో సినిమా పట్ల మంచి అంచనాలే నెలకొల్పింది. కాగా  దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ''మా సినిమాను భారి అంచనాల మధ్య  ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు తిసుకోస్తున్నాం, ఎల్లప్పుడూ మంచి సినిమాలను ఆధరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా ఘన విజయం చేస్తారని బలంగా నమ్ముతున్నాం ''  అని తెలిపారు.   

Recent News