- Home
- News
- చలో దర్శకుడు వెంకి కి ఐరా కారు గిఫ్ట్
చలో దర్శకుడు వెంకి కి ఐరా కారు గిఫ్ట్
19 Feb,2018
ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్, ఉషా నిర్మాతలుగా నాగశౌర్య, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛలో. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళ్తోంది. రెండు వారాలకి 23.31 కొట్ల గ్రాస్ వసూలు చేయటమె కాకుండా సాటిలైట్, రీమెక్ రైట్స్ తో మరో 6 కొట్ల వరకూ బిజినెస్ ఆఫర్ తో 2018 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలొ నిలిచిపోతుంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత ఉష ముల్పూరి ఈ చిత్రానికి పనిచేసి 24 క్రాఫ్ట్ వాళ్ళని సత్కరించుకున్నారు. దర్శకుడు వెంకి కుడుముల కి కారు గిఫ్ట్ గా ఇచ్చారు.
ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. గతం లో మేము మా ఫ్యామిలి తో సినిమాలు చూసేవాళ్ళం. సినిమా తీయాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు వుంటే చాలు అనుకునేవాళ్ళం కాని మా ఐరా క్రియోషన్స్ ప్రారంభించాక తెలిసింది. తెర మీద కనిపించే వారి వెనుక వందలాది శ్రామికుల కష్టం వుంటుందని. మా ఐరా క్రియోషన్స్ లో ఛలో చిత్రం ప్రారంభం అయిన రోజునే మా ఛలో చిత్ర విజయం సాధిస్తే తప్పకుండా 24 క్రాఫ్ట్ లోని ప్రతిఓక్కరిని మనం సత్కరించుకోవాలని నిర్ణయించుకున్నాము. అందుకే ఇది మా చిరు సత్కారం గా అందరూ భావించి విచ్చేశారు. ఇక్కడకి విచ్చేసిన వారందరికి నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు. మా దర్శకుడు వెంకి కుడుముల మాకు కథ చెప్పటం అది మాకు నచ్చటం వెంటనే మేము ప్రోడక్షన్ స్టార్ట్ చేయ్యటం జరిగింది. ప్రత్యక్షంగా , పరోక్షంగా మా ఐరా క్రియోషన్స్ మెదలు పెట్టడానికి మా దర్శకుడు కారణం కావటమే కాకుండా మా బ్యానర్ లో ఇంత మంచి చిత్రం దర్శకత్వం వహించినందుకు కృతజ్ఙతగా కారు గిఫ్ట్ గా ఇచ్చాము. మెదటి చిత్రంతో విజయ యాత్ర మెదలు పెట్టిన మా వెంకి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాము. అలాగే మా చిత్రానికి పని చేసిన వారికి, సపొర్ట్ చేసిన వారికి మా హ్రుదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము... అని అన్నారు.
దర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ.. నా తల్లి దండ్రులు సినిమాకి వెలతాను అంటే డబ్బులిచ్చారు. నాగసౌర్య తల్లిదండ్రులు డబ్బులిచ్చి సినిమా తీసారు. వారి రుణం ఏనాటికి మర్చిపోలేను. ఈ చిత్రం చేసే అవకాశం ఇవ్వటమే నాకు గిఫ్ట్, ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ హిట్ చేయటం డబుల్ గిఫ్ట్ అయితే ఇప్పుడు నాకు కారు గిఫ్ట్ ఇవ్వటం అనేది నేను జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ గా ఫీలవుతున్నాను. నాగసౌర్య అనే వ్యక్తి నాకు పరిచయం కాకపోతే నాకు ఈ జీవితం లేదు. ఎప్పటికి నేను గుర్తుపెట్టుకునే నా హీరో కి నా ధన్యవాదాలు. అలానే ఛలో చిత్రానికి పనిచేసిన కెమెరా మెన్ సాయి శ్రీరామ్ గారికి , ఎడిటర్స్ చంటి గారికి , తమ్మిరాజు గారికి, మ్యూజక్ డైరక్టర్ స్వర సాగర మహతి కి నా ప్రత్యేఖ దన్యవాధాలు, లిరిక్ రైటర్స్, డిబ్బింగ్ డిపార్ట్‌మెంట్ కి , నా డైరక్షన్ డిపార్ట్‌మెంట్ వారికి, నా చిత్రానికి పనిచేసిని ప్రతిఓక్కరికి నా ప్రత్యేఖ దన్యవాదాలు తెలుపుతున్నాను. అని అన్నారు
Recent News