కార్తీక టీజర్ ను విడుదల చేసిన వి వి వినాయక్. 

08 Feb,2018

కార్తీక చిత్ర  టీజర్ ను విడుదల చేసిన దర్శకుడు  వి వి వినాయక్. 

బేబీ అవంతిక ఆర్ట్స్ సమర్పణలో నిర్మాత మచెందర్  నట్టాల నిర్మిస్తున్న చిత్రం కార్తీక. విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రియాంక శర్మ, సింధు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ను వి వి వినాయక్ చేతుల మీదుగా ఇటీవలే విడుదలై ప్రశంసలు అందుకుంటోన్న సందర్భంగా ఏర్పాటు చేసిన    మీడియా సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్, లిరిక్స్ రైటర్ హరీష్ రావు, కో  ప్రొడ్యూసర్ వంశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత మాచెందార్ నట్టుల మాట్లాడుతూ మా ఈ కార్తీక చిత్ర టీజర్ ను విడుదల చేసిన దర్శకుడు వినాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా... సుభాష్ మ్యూజిక్ అద్భుతంగా అందించారు..  సినిమా కోసం అందరూ కష్టపడ్డారు.. బాగొచ్చింది.  త్వరలో ఆడియో వేడుకతో ప్రేక్షకుల ముందుకు వస్తాము.. అని తెలిపారు.. డైరెక్టర్ కొత పరశురాం మాట్లాడుతూ వినాయక్ గారి సపోర్టును మరవలేను. టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.. కెమెరా, డైలాగ్స్, మ్యూజిక్ ఇలా అన్నీ బాగొచ్చాయి.. చెప్పిన కథ చెప్పినట్టుగా చేసాను..కొత్త డైరెక్టర్ అని కాకుండా అందరూ బాగా సపోర్ట్ చేశారు నాకు.. నిర్మాత అయితే నాకేం కావాలో అది ఇచ్చి ప్రోత్సహించారు.. ఈ చిత్రం లో  ప్రధానంగా ఒక చిన్న పిల్ల పాత్ర ఉంటుంది. బేబీ వెన్నెల అద్భుతంగా నటించింది. ఈమెకు అవార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు... ఇక హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు. నన్ను చాలా బాగా చూసుకున్నారు... సినిమా లో పనిచేసిన వారందరికీ తప్పకుండా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా అన్నారు..  హీరో విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సినిమా చాలా బాగొ చ్చింది...ముఖ్యంగా  బేబీ వెన్నెల హైలెట్ అవుతుంది. ఇందులో ఉన్న 4సాంగ్స్ అందరినీ అలరిస్తాయి.. నటీనటులందరికీ మంచి పేరొచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నా అన్నారు. 

ఎ విజయ భాస్కరెడ్డి, ప్రియాంక శర్మ, సింధు, బేబీ వెన్నెల, అజయ్ ఘోష్, రోలర్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: మాచెందార్ నట్టాల, కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: కొత్త పరశురాం, కో ప్రొడ్యూసర్: వంశిధర్ రెడ్డి, డైలాగ్స్:   చింత శ్రీను, డి ఓ పి: వాలి ఎస్ కె. యాక్షన్: దేవరాజ్ నూనె, నందు, రియల్ సతీష్,  ఎడిటర్; బి. మహేందర్ నాధ్, లిరిక్స్: చింత శ్రీనివాస్, రామారావు.

Recent News