ఛలో సినిమా పై మీ అభిమానానికి కృతజ్ఞతలు
యువ హీరో నాగ శౌర్య , సరికొత్త సంచలనం కన్నడ భామ రష్మిక మండన్న హీరొయిన్ గా ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకి కుడుముల దర్శకత్వం లో విడుదల అయిన తాజా చిత్రం ఛలో. విడుదల అయిన ప్రతిచోట గ్యారంటీ హిట్ టాక్ తో దూసుకు పోతున్న ఈ చిత్రంతో యూత్, ఫ్యామిలి అభిమానులకు కూడా దగ్గరైన హీరో నాగ శౌర్య వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన చిత్రం సక్సెస్ టూర్ తో అందరినీ పలకరిస్తున్నాడు.
ఫిబ్రవరి 2 న విడుదల అయిన ఈ సినిమా నాగ శౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నైజాం ఏరియా తో పాటు మిగతా అన్నీ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ లకు కనక వర్షం కురిపిస్తూ చిన్న చిత్రాల్లో ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని అందుకునే దిశగా దూసుకుపోతున్న చలో సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో మొదటి సినిమానే ఇంతటి సంచలన విజయం సాధించటం చాలా గ్యాప్ తరువాత నాగ శౌర్య కు మంచి హిట్ సినిమా దొరకటం తో హీరో గా మరిన్ని అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. మొదటి సినిమాతో దర్శకుడు వెంకి కుడుముల, హీరొయిన్ రష్మిక కూడా అవకాశాల పరంగా టాప్ లిస్టు లోకి చేరుకున్నారు.
ఛలో విజయ యాత్ర వివరాలు:
తిరుపతి ,కదిరి, మదన పల్లి, అనంతపురం,
కడప, నంద్యాల, ప్రొద్దుటూరు, కర్నూలు,
నల్గొండ, మిర్యాలగూడ, ఖమ్మం,
వరంగల్, కరీంనగర్,
నిజామాబాదు, కామారెడ్డి.