ఇట్లు అంజలి - ఓ అమ్మాయి ప్రేమలేఖ

06 Feb,2018

కార్తికేయ, హిమాన్సీ, శుభాంగి పంతే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు ... అంజలి. ఓమా ప్రొడక్షన్స్ పతాకంపై నవీన్ మన్నెల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో నిర్మాత, దర్శకుడు నవీన్ మన్నెల మాట్లాడుతూ ప్రేమ లేఖ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అంజలి అనే అమ్మాయి రాసిన ప్రేమలేఖ అంజలి అనే పేరు గల మరో అమ్మాయి జీవితంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది అనేది ఈ సినిమా ఇతివృత్తం. చిత్రాన్ని ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రతీ సన్నివేశం మానవ జీవితాలకు, సహజత్వానికి దగ్గరగా వుండేలా తీర్చిదిద్దుతున్నాం. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు సరికొత్త అనుభూతికి లోనవుతాడు. కథకు తగ్గ సాహిత్యం, సంగీతం కుదిరాయి.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సీనియర్ సినిమా పాత్రికేయులు పసుపులేటి రామారావు చేతుల మీదుగా విడుదల చేయటం ఆనందంగా ఉంది అన్నారు. 

కార్తికేయ మాట్లాడుతూ ఓ అమ్మాయి ప్రేమలేఖే ఈ సినిమా. కథ, కథనం కొత్తగా వుంటుంది. మాటలు, పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చే  సినిమా అవుతుంది అన్నారు. హిమాన్సి మాట్లాడుతూ సరికొత్త కథ, కథనాలతో సాగే చిత్రమిది. కుటుంబ కథా చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా వుంది అని తెలిపారు. కథకు తగ్గట్లుగా ట్యూన్‌లు కుదిరాయని త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని సంగీత దర్శకుడు
కార్తీక్ కొడకండ్ల తెలిపారు.

Recent News