ఫిబ్రవరి 16న రచయిత విడుదల

03 Feb,2018

విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం "రచయిత". దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు.  సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న "రచయిత" చిత్రాన్ని ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండగా.. ఫిబ్రవరి 10న ఒంగోలులో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.  

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూలిపల్ల మాట్లాడుతూ.. "స్వచ్చమైన-అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. 1950 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ప్రొడక్షన్ వేల్యూస్ తో రూపొందించాం. సంచితా పడుకోనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం వైజాగ్ లో వేసిన భారీ సెట్, ఆ సెట్ లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆశ్చర్యపరుస్తాయి. మా డైరెక్టర్ కమ్ హీరో విద్యాసాగర్ నటుడిగా-దర్శకుడిగా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాడు. విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి విశేషమైన స్పందన లభించింది. ఫిబ్రవరి 16న చిత్రాన్ని విడుదల చేస్తుండగా.. ఫిబ్రవరి 10న ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నాం" అన్నారు.  

విద్యాసాగర్ రాజు, సంచితా పడుకోనే, శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర, అభిలాష్, రాగిణి, సంజిత్, సుప్రియా, అన్మోన, అనిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కళ: రాము, సంగీతం: షాన్ రెహమాన్, నేపధ్య సంగీతం: జీవన్.బి, మాటలు: కరుణాకర్ అడిగర్ల, పాటలు: చంద్రబోస్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, నిర్మాణం: దుహర మూవీస్, నిర్మాత: కళ్యాణ్ ధూలిపల్ల, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు.  

Recent News