సి.కళ్యాణ్ ఇంటిలిజెంట్ ప్రెస్ మీట్

01 Feb,2018

సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్ పై స్టార్ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ‘ఖైది నంబర్‌ 150’ చిత్రం తర్వాత  డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం మరియు మెగా ఫ్యామిలి నుంచే మరో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఈ సంవత్సరం జైసింహా తో ఇండస్ట్రీ హిట్ అందించిన సి.కళ్యాణ్ తదుపరి చిత్రం కావటం తో  ‘ఇంటిలిజెంట్‌’  పై  ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ ‘ఇంటిలిజెంట్‌’ చిత్ర విశేషాలను మీడియా తో పంచుకున్నారు.

బాలయ్య బాబుకు, ప్రభాస్ కు కృతజ్ఞతలు!

చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ – ”జనవరి 12న పొంగల్‌కి సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో నిర్మించిన మా ‘జై సింహా’ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేసి మా బేనర్‌కి 2018లో గొప్ప శుభారంభాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. జైసింహా సినిమాలాగే ఈ సినిమా కూడా ఎవరూ ఊహించని విధంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  ఇంటిలిజెంట్‌’ సినిమా ప్రారంభం రోజునే ఫిబ్రవరి 9న రిలీజ్‌ అని చెప్పటం జరిగింది. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. రీసెంట్‌గా మా నటసింహ బాలయ్యబాబు టీజర్‌ని రిలీజ్‌ చేశారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే మా యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పాటల్ని లాంచ్‌ చేశారు. అన్ని పాటలకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మా చిత్రం టీజర్‌ని, సాంగ్స్‌ని ఆదరిస్తున్న బాలయ్యబాబు అభిమానులకు, ప్రభాస్‌ అభిమానులకు, మెగా ఫ్యామిలి అభిమానులకు, సాయిధరమ్‌ తేజ్‌ అభిమానులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

రాజమండ్రిలో ‘ఇంటిలిజెంట్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలు!

‘ఇంటిలిజెంట్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఫిబ్రవరి 4న రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌ వై జంక్షన్‌లో భారీ ఎత్తున జరుపుతున్నాం. ప్రీ రిలీజ్ వేడుకలు సిని పరిశ్రమ కు దూరంగా కేవలం అభిమానులు, స్థానికులు లతో కలిపి జరుపుకుంటున్నాము. ఈ ఫంక్షన్ రాజమండ్రి లో చేయటం వెనుక ఒక కారణం ఉంది. అదేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది. మా వినాయక్ ప్రతి విషయాన్ని ఇంటిలిజెంట్ గా ఆలోచిస్తున్నాడు. బాలయ్య బాబు చెప్పినట్లు ఈ సినిమాకి మరియు ఫంక్షన్‌కి  నందమూరి అభిమానులు, రెబెల్ స్టార్ అభిమానులు మరియు మెగా అభిమానులు విచ్చేసి సక్సెస్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను.

మెగాస్టార్ కూడా ఇంటిలిజెంట్ కోసం ఎదురుచూస్తునారు.

‘ఛలో’ ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవిగారు ‘ఇంటిలిజెంట్‌’ టైటిల్‌ చాలా బాగుంది అని వున్నంత సేపు మా సినిమా గురించే మాట్లాడారు ఆయన. చిరంజీవిగారంటే మా వినాయక్‌కి చాలా ఇష్టం. ‘ఖైది నంబర్‌ 150’ చిత్రం తర్వాత పెద్ద హీరోలతో కాకుండా సాయిధరమ్‌ తేజ్‌తో సినిమా చేద్దాం అని నాతో చెప్పగానే ఓకే అని చెప్పాను. డబ్బుల కోసం ఏది పడితే అది చేసి క్యాష్‌ చేసుకునే అలవాటు వినాయక్‌కి లేదు. ఏ సినిమా చేసినా ఇష్టంతో, ప్రేమతో చేస్తాడు. కథ విషయంలో తను ఫుల్‌ శాటిస్‌ఫై అయ్యాకే సినిమా స్టార్ట్‌ చేస్తాడు. చాలా ఇంటిలిజెంట్‌గా ఈ చిత్రాన్ని తీశాడు. అభిమానుల అంచనాలకు మించి వుంటుంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్‌ గ్రాఫ్‌లో గొప్పగా చెప్పుకునే విధంగా ఈ చిత్రం నిలుస్తుంది. పాటలు, ఫైట్స్‌ విజువల్‌గా అద్భుతంగా వుంటాయి. సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందో ఎప్పుడు ఎండ్‌ అయ్యిందో కూడా తెలీకుండా మైమరచిపోయే విధంగా ఈ చిత్రం వుంటుంది. ‘ఇంటిలిజెంట్‌’గా సినిమా తీశారని ప్రేక్షకులు ఫీలయ్యేవిధంగా వుంటుంది. ‘జై సింహా’ మంచి ఫీల్‌ వున్న సినిమా. ఈమధ్యకాలంలో అలాంటి సినిమా రాలేదు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు చాలామంది. అశ్వనీదత్‌గారు వారి ఫ్యామిలీతో కలిసి సెకండ్‌ టైమ్‌ చూశానని ఫోన్‌ చేసి చెప్పారు. 2018 జనవరి 12 అనేది నా లైఫ్‌లో మర్చిపోలేని, మరపురానిది. ‘జై సింహా’ సెంటిమెంట్‌ సినిమా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందర్నీ అలరిస్తుంది. ఈ చిత్రంలో తేజ్‌ డ్యాన్స్‌లు ఇరగదీశాడు. అంతకు ముందు తేజ్‌ చిత్రాల్లో అన్నింటికంటే ఈ చిత్రంలో డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ బాగా చేశాడు. చిరంజీవిగారు బిగినింగ్‌లో ఎలా చేశారో తేజు అలా చేశాడని అన్పించింది. చాలా కష్టపడి కసితో చేశాడు. ఫ్యాన్స్‌ అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. థమన్‌ చాలా మంచి పాటలు ఇచ్చాడు. మొత్తం నాలుగు పాటలున్నాయి. వినాయక్‌ చాలా బాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ‘కళామందిర్‌’ అనే పాటని భాస్కరభట్ల అద్భుతంగా రాశారు. ఈ పాటని జనవరి 31న కళామందిర్‌ షోరూమ్‌లో లాంచ్‌ చేస్తున్నాం. దీంతో అన్ని పాటలు రిలీజ్‌ అయ్యాయి. అలాగే మహోన్నతమైన వ్యక్తి ఇళయరాజాగారు, సీతారామశాస్త్రిగారి చేతుల మీదుగా ‘చమక్‌ చమక్‌’ వీడియో సాంగ్‌ని భారీగా లాంచ్‌ చేస్తున్నాం. అది ఎప్పుడు అనేది చెప్తాను.

వినాయక్ తో నా జర్నీ ఈ సినిమా!

వినాయక్‌ డైరెక్షన్‌లో ఫస్ట్‌టైమ్‌ సినిమా తీశాను. మేమిద్దరం డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లా కాకుండా అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి వుంటాం. మా ఇద్దరి గొప్ప జర్నీ ఈ సినిమా. నిర్మాతగా ఎప్పుడూ టెన్షన్‌ పడకుండా డైరెక్టర్‌కి కావాల్సింది ఇస్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌గా షూటింగ్‌ చేశాం. అలాగే మా హీరో, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ ప్రతి ఒక్కరూ సహకరించారు. సినిమా చూశాను. ఎంత ప్రేమగా, అద్భుతంగా తీశాడో వినయ్‌ అని అర్థం అయ్యింది. ప్రతి ఫైట్‌, ప్రతి సాంగ్‌ని చాలా రిచ్‌గా తీశాం. ఈ సినిమా యాక్షన్‌ సీన్స్‌ కోసం సెట్స్‌ కూడా వేశాం. అన్నీ చాలా గ్రాండియర్‌గా వుంటాయి.

Recent News