శీలవతి గా షకీలా

27 Jan,2018

జీ స్టూడియోస్‌ పతాకంపై మలయాళం సూపర్‌ స్టార్‌ షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'శీలవతి'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో శీలవతి మూవీ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ''మా హీరోయిన్‌ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. మా నిర్మాతలు గణేష్‌, వీరబాబు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాము. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్‌ క్రిష్‌ అద్భుతమైన నేపథ్య సంగతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది'' అన్నారు. 

నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్‌. గణేష్‌ మాట్లాడుతూ.. ''ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.'' అన్నారు. 

మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ''చాలా సినిమాలకు పీఆర్వోగా, కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, రెండు సినిమాలకు నిర్మాతకు వ్యవహరించిన నేను ఈ చిత్రంతో మళ్లీ నిర్మాతగా మారుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. 

షకీలా, గీతాంజలి(ఫ్రూటీ), లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, కెమెరా: తరుణ్‌ కరమ్‌తోత్‌, డైలాగ్స్‌: యష్‌ యాదవ్‌, నిర్మాతలు: రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సాయిరాం దాసరి.

Recent News