బంగారి బాలరాజు - గ్లిట్టర్ విడుదల

27 Jan,2018

నంది క్రియేషన్స్ బ్యానర్ పై  కె.ఎం.డి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా "బంగారి బాలరాజు" చిత్రం తో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర గ్లిట్టర్ ను ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేసారు.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... బంగారి బాలరాజు టీజర్ చూసాను. చాలా బాగుంది. కొత్తగా వస్తున్న ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ రఫి గారికి, రాఘవేంద్రరెడ్డి గారికి డైరెక్టర్ కోటేంద్ర కి, హీరో రాఘవ్ కు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్ ద బెస్ట్ చెప్పారు.

చిత్ర నిర్మాతలైన కె.ఎం.డి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ... సురేందర్ రెడ్డి గారి లాంటి ప్రముఖ దర్శకులు చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఆయన సైరా మూవీ లో బిజీ గా ఉన్నా మాకు టైమ్ కేటాయించి టీజర్ ని విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

డైరెక్టర్  కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మా బంగారి బాలరాజు మూవీ గ్లిట్టర్ ని పెద్ద మనసుతో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలాంటి కొత్త దర్శకులకు సురేందర్ రెడ్డి గారు ఆదర్శంగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్ ని ఫిబ్రవరి 14 న,  సినిమాని మార్చి లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నాము అని తెలిపారు.

నటీనటులు – రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి, జబర్దస్త్ బాబి, బి.వి. చౌదరి, సుదర్శన్ దోర్నాల్, జయభారత్ రెడ్డి.  సాంకేతిక వర్గం – సంగీతం : చిన్నికృష్ణ - చిట్టిబాబు రెడ్డిపోగు,  కెమెరా : జి.ఎల్. బాబు, ఆర్ట్ : కృష్ణమాయ, కో డైరెక్టర్ : హేమంత్ కుమార్,  నిర్మాతలు : కె.ఎండి. రఫి మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి,  కథ,మాటలు,స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : కోటేంద్ర దుద్యాల.

Recent News