ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా అనసూయ భరద్వాజ్
డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా, 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. విష్ణు మంచు, శ్రియలు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. వారి లుక్స్ కి కూడా విశేష స్పందన వచ్చింది. తాజాగా అనసూయ పాత్ర పరిచయ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అనసూయ శ్రేష్ఠ జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా కనిపించనున్నారు. పోస్టర్ పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తి రేపుతోంది. కథలో ప్రాధాన్యత ఉండే పాత్ర అని తెలుస్తోంది. నిఖిల విమల్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
కథ-మాటలు: డైమండ్ రత్న బాబు సంగీతం: ఎస్.ఎస్.తమన్,
ఛాయాగ్రహకుడు: సర్వేశ్ మురారి, ఆర్ట్: చిన్న,
ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్,
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్,రవి బయ్యవరపు
కో-రైటర్: రవి బయ్యవరపు నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: మదన్ రామిగాని