ఆచారి అమెరికా యాత్ర వాయిదా

23 Jan,2018

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల అవుతుందని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ కూడా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకలో ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. అయితే తాజాగా హీరో మంచు విష్ణు ఈ సినిమా రిపబ్లిక్‌డేకి విడుదల కావడం లేదంటూ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ‘‘ఇప్పటి వరకు చెప్పినట్లుగా జనవరి 26వ తేదీన ఆచారి అమెరికా యాత్ర విడుదల కావడం లేదు. దురదృష్టవశాత్తూ సినిమాని వాయిదా వేయడం జరిగింది. సినిమా వేసవికి విడుదల అవుతుంది’’ అంటూ మంచు విష్ణు పోస్ట్ చేశారు.

Recent News