50 కోట్ల క్లబ్బులో జైసింహా

23 Jan,2018

నందమూరి బాలకృష్ణ హీరోగా కే.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో సి. కళ్యాణ్ నిర్మించిన చిత్రం జైసింహా. బాలయ్య బాబు 102 చిత్రంగా సంక్రాంతి కి విడుదల అయి 10 రొజుల్లొనె 50 కోట్ల క్లబ్బు లోకి చేరింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పంపిణీదారులతో చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు.

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ "ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలో చిత్రాన్ని నిర్మించి విడుదల కు సహకరించిన దర్శకునికి, టేక్నిషియన్లకు కృతజ్ఞతలు" ‘‘ఇప్పుడు చిత్రపరిశ్రమలో వంద లేదా యాభై రోజుల పండగలు లేవు. ఎన్ని కోట్లు అనే పండగ మొదలైంది. అందులో మేం మొదటి పది రోజుల్లో 50 కోట్ల పండగ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు, ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు’’. అలాగే చివరి నిమిషం వరకు తనకు సహకరించిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్‌ ఎన్వీ ప్రసాద్‌ గారికి, వైజాగ్, కృష్ణా, గుంటూర్, నెల్లూర్, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, నైజాం ఏరియా ల పంపిణీదారు లకు చిత్ర విజయం పట్ల శుభాకాంక్షలు తెలియ చేసారు.

చిత్రదర్శకులు కే.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ:-  ఈ సినిమా 50 కోట్లు వసూల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా 100 కోట్లకు చేరుతుంది . సంక్రాంతి కి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. బాలయ్య గారి సినిమా అంటే బి.సి. సెంటర్ లలోనే ఆడుతుంది అని చెప్పారు అది నిజం కాదు అని ఏ క్లాస్ సెంటర్ లలో కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ అయ్యింది. మంచి  డైలాగ్  రాసిన ఎం. రత్నం  మరియు టీం కు శుభాకాంక్షలు.

హీరో బాలక్రిష్ణ మాట్లాడుతూ:  "నాకు రికార్డు లు పెద్దగా గుర్తుకు రావు. వాటి వివరాలు నా అభిమానులు చెపుతారు. నా సినిమాలన్నీ దాదాపు హిట్ సినిమాలే. అయితే ఈ  సినిమా హిట్ కావటం  పంపిణీదారు లకు  కనక వర్షం కురుపిస్తూ మొత్తం చిత్ర పరిశ్రమకు ఆనందాన్ని కలిగించింది. చాలా  మంది డిస్ట్రిబ్యూటర్లు మా నాన్న గారి కి కూడా అభిమానులు అని తెలిసి గర్వంగా ఉంది. అలాగే ఈ రోజు నిర్మాతల పరిస్థితి మీకు తెలుసు. హీరో, డైరెక్టర్  ఏది చెబితే  అది వినాలి. కాని నేను మాత్రం ఖచ్చితంగా నిర్మాత పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తాను. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని నమ్మే వ్యక్తిని  నేను. ఈ చిత్ర నిర్మాణంలో, విజయంలో భాగస్వాములయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు" అని తెలిపారు.

అనంతరం చిత్ర యూనిట్ కు మరియు డిస్ట్రిబ్యూటర్లకు హీరో బాలకృష్ణ చేతుల మీదుగా షీల్డ్ లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో బాహుబలి ప్రభాకర్, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఎన్.వీ. ప్రసాద్, నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్,అలాగే మిగతా డిస్ట్రిబ్యూటర్లు శివారెడ్డి, ఫణి, రమేష్, విజయ్, మహేష్, కృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్, ప్రసాద్, చిన్నారి స్వేతన్ పాల్గొన్నారు.

Recent News