తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఘనం గా అన్న నందమూరి తారకరామారావు 22 వ వర్ధంతి కార్యక్రమం........తమిళనాడు తెలుగు యువశక్తి అన్న నందమూరి తారకరామారావు వర్ధంతి ని నేటి నుండి 19 వ తారీకు వరకు నిర్వహించుచున్నారు ..అందులో భాగంగా నేడుసౌత్ చెన్నై .రాజఅన్నామలై పురం.బగ్స్ రోడ్డు నందు కల తెలుగు వారి కాలనీ లో ముగ్గుల పోటీలను నిర్వహించి వారి ప్రధమ బహుమతి ఎస్.అహల్య కు 1001 /రెండవ బహుమతి ఆర్. మణికుమారి కి 501/ మూడవ బహుమతి డి. దమయంతి 251/అందచేశారు...ఈ ముగ్గుల పోటీ నాయనిర్ణేత గా దేవరకొండ వెంకటలక్ష్మి. సూర్యకుమారి వ్యవహారించారు....తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తొలుత గా ఎన్.టీ. రామారావు ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించి. ముగ్గుల పోటీలో విజేత లకు బహుమతులు సమర్పించారు. ఇట్టి సందర్భంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడు తు '" అన్న నందమూరి తారకరామారావు బ్రతికి ఉంటె తమిళనాడు లో తెలుగు బాష కు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావాని, చెన్నై లో నివసించే ప్రజల దాహార్తిని తీర్చి తమిళుల గుండెల్లో వారి స్థానం ఇప్పటికి చిరస్థాయిగా ఉందని, ప్రపంచంలో తెలుగు వాడి ప్రతిష్టాతను పైంచిన ఒక యుగపురుషుడాని ,ఆయన ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ఇప్పటి కి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాయని, అన్న జీవిత చరిత్ర లో ఒక భాగం ను చలనచిత్రం గా తాను నిర్మించడం ఒక అదృష్టమని.అన్న ఆశయ సాధనకు నిరంతరం పోరాటం చేసుతునే ఉంటానని..పెద .బడుగు వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమంలను చేశారని.... ఆయన మరణించిన కూడా ప్రజల మనసులో ఆయన స్థానం తిరుగు లేనిదని ....కేతిరెడ్డి తెలిపారు