జనవరి 20న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `తొలి ప్రేమ` ఆడియో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం `తొలిప్రేమ`. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పాటలను జనవరి 20న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా...నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ - ``కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వచ్చిన వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం `తొలి ప్రేమ`. హృదయానికి హత్తుకునే ప్రేమకథ. వరుణ్ తేజ్ కొత్త పాత్రలో కనపడతారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, నిన్నిలా నిన్నిలా చూశానే...అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్‌ను జనవరి 20న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. అలాగే ఫిబ్రవరి 9న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రానికి సంగీతంః ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్.