అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ - జివికె మనవరాలు శ్రేయా భూపాల్ వివాహ నిశ్చితార్ధంను డిసెంబర్ లో ఘనంగా నిర్వహించారు. అయితే...ఏమైందో ఏమో కానీ అఖిల్ - శ్రేయా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే ఇదే. అఖిల్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఎంత షాకింగో...ఈ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడం కూడా అంతే షాకింగ్. అఖిల్, శ్రేయా భూపాల్ మధ్య విభేదాలు రావడంతో వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట. అక్కినేని ఫ్యామిలీ, జివికె ఫ్యామిలీ అఖిల్, శ్రేయా భూపాల్ ఇద్దరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నో అనడంతో ఇక వివాహాం క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక నుంచైనా అఖిల్ కొన్ని సంవత్సరాలు పెళ్లి గురించి ఆలోచించకుండా కెరీర్ పై దృష్టి పెడితే బాగుంటుంది. మరి...ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..!