మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్ధ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి కానీ కుదరలేదు. 1990 నాటి గ్రామీణ నేపధ్యంతో రూపొందుతున్నఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్నిత్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే...1990 నాటి గ్రామీణ నేపధ్యానికి తగ్గట్టు ఉండే పొలాచ్చి అయితే బాగుంటుందనేది చిత్రయూనిట్ ఆలోచన. అందుకనే పొలాచ్చిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు నిర్ణయించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత కధానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రయోగాత్మక చిత్రం రామ్ చరణ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి..!