సిన్నపెద్ద సిగమోచ్చి ఊగెటట్టూ సింతలన్ని గాలికెగిరిపోయెటట్టూ సుట్టుకున్న కష్టమారిపోయెటట్టూ పట్టుకున్న భాదలావిరయ్యెటట్టూ.. కొట్టు కొట్టు డండనక కొట్టు అమ్మదయ మనపై వానలెక్క బడెటట్టు.. అరే కొట్టు కొట్టు డప్పుదెచ్చి కొట్టు గుండెలల్ల భయ్యం బయిటిబడి సచ్చెటట్టూ` అంటూ సాగే రాధాకృష్ణ సినిమాలోని మాస్ సాంగ్ ని ఇస్మార్ట్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విడుదలచేశారు.
ఈ సందర్భంగా ఇస్మార్ట్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ మాట్లాడుతూ - ``ఎమ్ఎమ్ శ్రీలేఖ గారు మ్యూజిక్ చేసిన `రాధాకృష్ణ` మూవీలోని కొట్టు కొట్టు సాంగ్ విన్నాను. జాతర నేపథ్యంలో వచ్చే ఈ మాస్ సాంగ్ చాలా బాగుంది. రాహుల్ సిప్లిగంజ్ బాగా పాడాడు. తెలంగాణ గ్రేట్ హెరిటేజ్ నిర్మల్ బొమ్మ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో పైసా వసూల్ మూవీలో నటించిన ముస్కాన్ సేథి హీరోయిన్‌గా నటిస్తోంది. రాధాకృష్ణ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ప్రముఖ దర్శకుడు `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాసరెడ్డి సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్, శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకాలపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ `` ఇలాంటి ఒక మంచి మాస్ అండ్ పెప్పీ సాంగ్ పాడే అవకాశం ఇచ్చిన శ్రీలేఖ మేడమ్ గారికి నా దన్యవాదాలు. తప్పకుండా ఈ సింగ్ పెద్ద బ్లాస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే రాధాకృష్ణ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నిర్మాణ సారథి కృష్ణ కుమార్ మాట్లాడుతూ - రాధాకృష్ణ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి నా ప్రత్యేక దన్యవాదాలు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ కి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్ కి మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాము. ఇంత మంచి పాట ఇచ్చిన ఎమ్ ఎమ్ శ్రీలేఖ గారికి, అలాగే అద్బుతంగా పాడిన రాహుల్ సిప్లిగంజ్, పాట రాసిన వరికుప్పల యాదగిరి గారికి
దన్యవాదాలు. డమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి గారి సమర్పణలో అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం రూపొందుతోంది` అన్నారు.
అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్), అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఎడిటింగ్: డి.వెంకటప్రభు, ఆర్ట్: వి. ఎన్ సాయిమణి, సమర్పణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సారథ్యం: కృష్ణ కుమార్, నిర్మాత: పుప్పాల సాగరిక, కృష్ణకుమార్, దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.