"ఒక అమ్మాయితో..." ( కోవిడ్ టైమ్ క‌హానీ )

23 Aug,2020

ఏక్ దో తీన్ ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై ముర‌ళీ బోడ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ఒక అమ్మాయితో.. (కోవిడ్ టైమ్ క‌హానీ) అనేది ఉప శీర్షిక‌. గార్ల‌పాటి ర‌మేష్‌, డా. వి. భట్ నిర్మాత‌లు.  శీత‌ల్ భ‌ట్‌, సూరజ్ ప‌వ‌న్‌, శ్రీ‌రాగ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  చిత్రం గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ... ఇది చ‌క్క‌ని యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీ.  వినోదం ప్ర‌ధానంగా రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది.  ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప‌రిస‌ర‌రాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. క‌థ‌రీత్యా చ‌క్క‌టి లొకేష్ల‌న్ల‌లో తెర‌కెక్కిస్తున్నాం. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియజేస్తామ‌ని పేర్కొన్నారు.  ఇంకా ఈ చిత్రంలో ర‌ఘు కారుమంచి, గుర్లీన్ చోప్రా, అశోక్‌కుమార్‌, జ‌బ‌ర్ద‌స్త్ ప‌ణి, జీవ‌న్‌, ప‌టాస్ ప‌వ‌న్‌, సుశీల్ మాధ‌వ‌పెద్ది, సురేశ్‌బాబు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతంః క‌న్ను స‌మీర్‌, సినిమాటోగ్ర‌ఫీః తోట వి. ర‌మ‌ణ‌, ఎడిట‌ర్ః కిషోర్ మద్దాలి, కొరియోగ్ర‌ఫీః భాను మాస్ట‌ర్‌, ఆర్ట్ః పి.ఎస్‌. వ‌ర్మ‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః సుధాక‌ర్ బెన‌ర్జీ, మేక‌ప్ః బాలు, కాస్ట్యూమ్స్ః ర‌ఫీ, క‌థ‌, స్స్కీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః ముర‌ళీ బోడ‌పాటి, నిర్మాత‌లుః గార్ల‌పాటి ర‌మేశ్‌, డా. వి. భ‌ట్‌.

 

Recent News