విబి ఎంటర్ టెన్మెంట్స్ సినీ టివి డైరీ 2020 లాంచ్

12 Aug,2020

విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ  2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్ టైన్మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని , లేడీ డైనమిక్     డైరెక్టర్, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత కీ. శే. శ్రీమతి విజయనిర్మల గారికి అంకితమిస్తూన్న డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్, సినీ హాస్య నటులు బాబూ మోహన్, దర్శకుడు వి. ఎన్. ఆదిత్య, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, ఎస్.ఆర్. ఆర్ ఇన్ఫాస్టెక్చర్స్ అధినేత శ్రీనివాసరెడ్డి, వి వి కె హౌసింగ్ అధినేత విజయ్ కుమార్ , వి. బి .ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విష్ణు బొప్పన, బి జె పి అధికార ప్రతినిధి అనుగుల రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వి.బి ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం అండ్ టి వి డైరీని నటుడు బాబూ మోహన్ ఆవిష్కరించి తొలికాపీని నటుడు నరేష్ కు, రెండవ కాపీని దర్శకుడు వి. ఎన్ .ఆదిత్య కు అందజేసారు. అనంతరం త్వరలో జరగబోయే వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ పోస్టర్ ను నరేష్ విడుదల చేసారు. అతిధులంతా కలసి నటుడు పొట్టి వీరయ్యకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు తో పాటు ఎస్. ఆర్. ఆర్ ఇన్ఫాస్టెక్చర్ అధినేత శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయం అందజేసారు. వీరితో పాటుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఫెంక్షన్ రాని పదిమంది పేద కళాకారులకు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమం చూసి స్పందించిన వి.వి.కె హౌసింగ్స్ అధినేత విజయకుమార్ మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఒక లక్ష రూపాయల విరాళం ప్రకటించి చెక్కును ప్రెసిడెంట్ ‌నరేష్ కు అందజేసారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధి బాబూ మోహన్ మాట్లాడుతూ....ఈ సంవత్సరం డైరీని లేడీ డైనమిక్ డైరెక్టర్, గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత కీ. శే. విజయ నిర్మల కు అంకితం ఇవ్వడం, పొట్టి వీరయ్య లాంటి కళాకారుడిని సన్మానించుకోవడం, ఈ కరోన క్రైసెస్ టైం లో పేద కళారులకు సాయం చేసిన విష్ణు బొప్పన ను అభినందిస్తున్నాను.

నరేష్ మాట్లాడుతూ....ఓ సంస్థ ను నడుపుతూ అందులో పేద కళాకారులును విష్ణు ఆడుకోవడం ఆనందదాయం. ఈ కరోన సమయంలో కూడా కష్టపడి డైరీని రూపొందించి , మా అమ్మగారికి అంకితం ఇవ్వడం, సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు పొందడం విష్ణు పట్టుదలకు నిదర్శనం.


వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ..... ఈ కరోన సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తునందుకు రావాలా వద్దా అని సంశయిస్తు వచ్చాను. ఇక్కడికి వచ్చాక అందర్నీ చూసి ఆనందం కలిగింది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తునందుకు విష్ణు ను అభినందిస్తున్నాను.

శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.... ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎస్ .ఆర్. ఆర్ ఇఫాస్టెక్చర్స్   స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు  సంతోషాన్ని వ్యక్తం చేస్తూ..
మరిన్ని మంచి కార్యక్రమాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
విష్ణు బొప్పన మాట్లాడుతూ.... ఈ ఏడాది 2020 డైరీని మార్చి నెల 27 తారీఖున ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం కానీ కోవిడ్ 19 కారణంగా, లాక్డౌన్ రావడంతో వాయిదా వేసుకుని, ఈరోజు న కరోన నిబంధనలకు అనుగుణంగా, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిర్వహించాం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు .

Recent News