ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత, థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్ ఆరోగ్యం పై పలు వదంతులొస్తున్న నేపథ్యంలో సునీల్ నారంగ్ సోదరుడు భరత్ నారంగ్ మాట్లాడుతూ, "రాత్రి సడెన్ గా గుండె నొప్పి రావడం తో అపోలో హాస్పిటల్ లో చేరారు. డాక్టర్స్ వెంటనే స్టంట్ వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. రేపు డిశ్చార్జ్ అవుతారు. తన ఆరోగ్యం గురించి ఫోన్లు చేస్తున్న అందరికీ సునీల్ నారంగ్ కృతజ్ఞతలు చెప్తూ తాను క్షేమంగా ఉన్నట్లు, రేపు డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలుపమన్నారు." అన్నారు