ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంది: రామ్‌చ‌ర‌ణ్‌

12 Aug,2020

సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియావ‌ర్క్స్‌, మ‌హాయాణ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కులను ఈ చిత్రం ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ చిత్ర యూనిట్‌కు ట్విట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

‘‘రీసెంట్‌గా నేను చూసిన చిత్రాల్లో ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య నా మ‌న‌సుకెంతో నచ్చింది. అద్భుత‌మైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. స‌త్య‌దేవ్‌, న‌రేశ్‌గారు, సుహాస్‌, హ‌రి చంద‌న‌, రూప త‌దిత‌రుల న‌ట‌న న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’ అన్నారు రామ్ చ‌ర‌ణ్‌. 

Recent News