ప్రస్తుతం సౌత్ ఇండియాలో క్రేజీ హీరో ల్లో మళయాల నటుడు నివిన్ పాలీ
ఒకరు.ప్రేమమ్ మూవీతో దేశమంతా క్రేజ్ సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఆయన
సినిమాలన్నిటికీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఫ్యాన్స్ అయిపోయారంతా. ఆయన
నటించిన ‘‘మూతన్’’ అనే సినిమా కూడా దేశ వ్యాప్తంగా సంచలనం
సృష్టించింది.ఇప్పుడు ఆ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది.
ప్రతిష్టాత్మకమైన ‘‘న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్’’ లో ఈ సినిమా
ఏకంగా మూడు అవార్డులు గెలుచుకోవడం విశేషం. అక్బర్ పాత్రలో మంచి
పర్ఫార్మెన్స్ అందించిన నివిన్ పాలీ కి ఉత్తమ నటుడిగా అవార్డు రాగా,
బెస్ట్ చైల్డ్ అర్టిస్టుగా సంజనా దీపు, బెస్ట్ మూవీ గా ‘‘మూతన్’’, ఇలా
మూడు అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది.
నివిన్ ఈ అవార్డు అందుకున్న మొదటి మలయాలం నటుడు కావడం విశేషం.
గతేడాది నవంబర్ లో హిందీ,మళయాలం భాషల్లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ
విమర్శకుల నుండి అలాగే ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంది.గీతూ మోహన్ దాస్
డైరెక్ట్ చేసిన ఈ మూవీని హిందీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్
నిర్మించాడు.నివిన్ పాలీ తో పాటు శోభిత ధూలిపాల్ల,శశాంక్ అరోరా, రోషన్
మథ్యూ, సంజనా దీపూ తదితరులు నటించారు.