ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో రూపొందుతున్న
మిస్టర్ లోన్లీ చిత్ర పోస్టర్ ను విశాఖ ఎంపీ, సినీ ప్రొడ్యూసర్ ఎం.వి.వి.సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఈ చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ, డైరెక్టర్ ముక్కి హరీష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం వి వి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని, కథాంశం అందరినీ ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే కథతో, కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ చిత్రం అన్ని వర్గాల ప్రజలను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేషమైన ఆదరణ లభించింది అన్నారు.
ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ ఆనంద్ గారా, నటీనటులు విక్కీ, , కియారెడ్డి , సోనాలి వర్ధమ్, లోహిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు