*శివరాజ్ కుమార్ నటించిన "బజరంగీ-2" మూవీ టీజర్ కు అద్భుత స్పందన.

13 Jul,2020

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త
చిత్రం "బజరంగీ-2" టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2013 లో వచ్చి పెద్ద హిట్
అయిన " బజరంగీ " చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ
టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడ చిత్రమే అయిన కానీ పాన్
ఇండియా చిత్రం లాగా బాలీవుడ్ తో సహా అన్ని సౌత్ భాషల వాళ్ళు ఈ చిత్ర
టీజర్ ను ఆన్ లైన్ లో షేర్ చేస్తూ టీజర్ భలే ఉందంటూ మెచ్చుకోవడం విశేషం.ఈ
రెస్పాన్స్ చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో
రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.త్వరలోనే తెలుగు లో కూడా ఈ సినిమా డబ్
కానుంది.టీజర్ చూసి పలువురు ప్రొడ్యూసర్ లు, డిస్ట్రిబ్యూటర్ లు ఈ సినిమా
డబ్బింగ్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేశారు.

టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురుంచి హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ :
2013 లో మేము తీసిన "బజరంగీ" పెద్ద హిట్ కావడం తో దానికి సీక్వెల్ గా ఈ
"బజరంగీ-2" మూవీ భారీ గా తీయాలని భావించాం. కానీ ఈ టీజర్ కు ఇంత
రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.అన్ని ఇండస్ట్రీ ల నుండి కాల్స్
వస్తున్నాయి. ఈ అద్భుతమైన రెస్పాన్స్ కి అందరికీ ధన్యవాదాలు." అన్నారు.

"బజరంగీ-2" టీజర్ విజువల్ గా అద్భుతంగా ఉంది.బాక్ గ్రౌండ్
స్కోర్,గ్రాఫిక్స్ షాట్స్ చూస్తుంటే మరో "కెజిఎఫ్" తరహా సినిమా కాబోతుంది
అనిపిస్తుంది.పీరియాడిక్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ
లో శివరాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్ గా నటిస్తుంది. జయన్న ఫిలిమ్స్
బ్యానర్ పై జయన్న మరియు భోగేంద్ర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ ని ఎ.హర్ష
డైరెక్ట్ చేశారు.థియేటర్ లు ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా
రిలీజ్ కాబోతుంది.

Recent News